ప్రెజెంట్
యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా
DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్
పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి
12న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్
కి ముందే మరో ఇంట్రెస్టింగ్ అప్
డేట్ ఇచ్చాడు హీరో. ఈ సినిమాకు సీక్వెల్
కూడా ఉందంటూ చెప్పుకున్నాడు. ఫ్రాంచైజీ చేసే స్కోప్ ఈ
కథకి ఉందంటూ తెలిపాడు. అయితే DJ టిల్లు రిజల్ట్ మీద తాము ఫుల్
కాన్ఫిడెంట్ గా ఉన్నామని ఆ
సినిమా సక్సెస్ సాధించాక కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.
ఇక
DJ టిల్లు కథను లాక్ డౌన్
టైంలో రాసుకున్నామని , దర్శకుడు విమల్ తో కలిసి ఈ
కథను తాయారు చేశామని డైలాగ్స్ మాత్రం తనే రాసుకున్నానని తెలిపాడు.
ప్రేమకథకు క్రైం ఇన్సిడెంట్ జోడించి ఈ కథను రెడీ
చేశామని, హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ బ్యాలెన్స్
గా చేసుకుంటూ వెళ్లాం. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పగలను అన్నాడు. అలాగే సితార ఎంటర్టైన్ మెంట్ లోనే ఇంకో సినిమా
చేస్తున్నాని , ఆ సినిమా షూటింగ్
స్టేజిలో ఉందని తెలిపాడు. అలాగే మరో మూడు సినిమాలు
లైన్లో ఉన్నట్లు చెప్పుకున్నాడు కుర్ర హీరో. మరి DJ TILLU సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ఆ
సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంది.
Read More : http://www.zeecinemalu.com/en/news-gossip/a-sequel-to-dj-tillu-says-siddhu-jonnalagadda-199512/