Thursday, February 10, 2022

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today


 

ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన సినిమా ఫిబ్రవరి 12 థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిలీజ్ కి ముందే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు హీరో. సినిమాకు సీక్వెల్ కూడా ఉందంటూ చెప్పుకున్నాడు. ఫ్రాంచైజీ చేసే స్కోప్ కథకి ఉందంటూ తెలిపాడు. అయితే DJ టిల్లు రిజల్ట్ మీద తాము ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని సినిమా సక్సెస్ సాధించాక కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.

ఇక DJ టిల్లు కథను లాక్ డౌన్ టైంలో రాసుకున్నామని , దర్శకుడు విమల్ తో కలిసి కథను తాయారు చేశామని డైలాగ్స్ మాత్రం తనే రాసుకున్నానని తెలిపాడు. ప్రేమకథకు క్రైం ఇన్సిడెంట్ జోడించి కథను రెడీ చేశామని, హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్లాం. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పగలను అన్నాడు. అలాగే సితార ఎంటర్టైన్ మెంట్ లోనే ఇంకో సినిమా చేస్తున్నాని , సినిమా షూటింగ్ స్టేజిలో ఉందని తెలిపాడు. అలాగే మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నట్లు చెప్పుకున్నాడు కుర్ర హీరో. మరి DJ TILLU సీక్వెల్ ఉంటుందా లేదా అనేది సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంది.

Read More : http://www.zeecinemalu.com/en/news-gossip/a-sequel-to-dj-tillu-says-siddhu-jonnalagadda-199512/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...