Sunday, April 18, 2021

Dil Raju reaction on Vakeelsaab Success | Zee Cinemalu Movie Updates

ఏప్రిల్ 9 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కం బ్యాక్ ఫిలిం 'వకీల్ సాబ్' మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఒక వైపు కరోన ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సులువుగా 100 కోట్ల మార్క్ దాటేసింది వకీల్ సాబ్. ఈ సినిమా అన్ని విధాలుగా సంతోష పెట్టిందని తాజాగా ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాడు దిల్ రాజు.

ప్రెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ " ఒక సినిమా తీసేముందు ఇది ప్రేక్షకులకు ఎంత రీచ్ అయితే అంత పెద్ద సక్సెస్ అయినట్టు అనుకుంటాను. ఈ సినిమా తీసే ముందు కూడా అలాగే అనుకున్నా. నిజంగా ఈ రోజు సినిమా జనాలకి రీచ్ అయిన విధానం వకీల్ సాబ్ ప్రతీ ఒక్కరు మాట్లాడుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. రిలీజ్ కి ముందున్న ఇబ్బందులతో పాటు కోవిడ్ ని దాటి సినిమాను రీచ్ చేయగలిగాం. ముఖ్యంగా మహిళా మానులకు సినిమా బాగా చేరువైంది. ఇక కొన్ని సినిమాలకే అభినందనలు అందుతాయి.. కానీ అభినందనలతో పాటు ఎకానమీ పరంగా కూడా నా కెరీర్ లోనే 'వకీల్ సాబ్' బెస్ట్" మా టీం అందరూ చాలా హ్యాపీ" అంటూ తెలియజేశారు.

"అలాగే ఒక సినిమా రీచ్ అవ్వాలంటే మూడు ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ఒకటి థియేటర్స్ రెండు OTT మూడు టివీ. ఇప్పటికీ థియేటర్స్ లో దాదాపు సినిమా అందరూ చూశారు ఇంకా చూస్తున్నారు. అలాగే "ఒక వేళ కోవిడ్ కారణంగా ఎవరైనా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడలేకపోయిన వాళ్ళు కచ్చితంగా మిగతా ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తారు. " అంటూ సినిమా సక్సెస్ గురించి తెలిపారు దిల్ రాజు.

ప్రెస్ మీట్ లో దిల్ రాజుతో పాటు దర్శకుడు వేణుశ్రీరామ్ కూడా పాల్గొన్నాడు. తనకు, దిల్ రాజుకు కరోనా సోకలేదని సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు వేణుశ్రీరామ్.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/dil-raju-reaction-on-vakeelsaab-success-venu-sriram-188360/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...