Saturday, May 29, 2021

Chiranjeevi demands Bharata Ratna for NTR | Zee Cinemalu News Updates

తెలుగు జాతి గౌరవం , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడిని తలుచుకుంటూ స్టార్స్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఉదయం నుండే ట్విట్టర్ లో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఉదయం నందమూరి బాలకృష్ణ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇప్పటికే పలు సార్లు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకున్న మెగా స్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని , ప్రేమను మరో సారి ట్విట్టర్ వేదికగా చాటుకున్నారు.

జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని మెగా స్టార్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ప్రముఖ గాయకుడు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ నమస్కారం" అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు చిరు.

ఎన్టీఆర్ గురించి మెగా స్టార్ పెట్టిన ఈ ట్వీట్ చూసి తెలుగుదేశం నాయకులు , నందమూరి అభిమానులు చిరుకి ధన్యవాదాలు చెప్తూ త్వరలోనే ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు. కొన్నేళ్ళుగా ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి మన తారక రాముడికి ఆ అరుదైన గౌరవం తొందర్లోనే దక్కాలని కోరుకుందాం.

 

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/chiranjeevi-demands-bharata-ratna-for-ntr-190094/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...