దగ్గుబాటి కుటుంబం నుండి త్వరలోనే మరో హీరో రాబోతున్నాడు. అవును దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నాడు. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. ప్రెజెంట్ కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడు తేజ.
'ఉప్పెన'
సినిమాతో రిలీజ్ కి ముందే క్రేజ్ సంపాదించుకొని రిలీజ్ తర్వాత స్టార్డం అందుకున్న కృతి
శెట్టితో ఇటివలే సంప్రదింపులు జరిపారట తేజ అండ్ టీం. ప్రస్తుతం కృతి నాని శ్యామ్ సింగ
రాయ్ సినిమాతో పాటు సుదీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తుంది.
చేస్తున్న ఈ రెండు సినిమాలే కాకుండా అమ్మది లిస్టులో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైనప్
లో ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మరీన కృతి అభిరామ్ సినిమాకు డేట్స్
అడ్జస్ట్ చేస్తుందా లేదా చూడాలి.
త్వరలోనే కృతి ని ఫైనల్ చేసి హీరో - హీరోయిన్ లతో ఓ ఫోటో షూట్ చేసి సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ పై సురేష్ బాబు నిర్మించానున్నారని సమాచారం. త్వరలోనే ఈ దగ్గుబాటి యంగ్ హీరో సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి.
No comments:
Post a Comment