నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ #TuckJagadish గురించి మేకర్స్ నుండి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు నాని ఫ్యాన్స్. సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు. భారీ హంగామా చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. సరిగ్గా థియేటర్స్ లోకి వచ్చే టైంకి కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగిలింది. ఆ వెంటనే సినిమాను వాయిదా వేసుకున్నారు మేకర్స్.
త్వరలోనే థియేటర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి.
తెలంగాణాలో అంతా క్లియర్ అయింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేటు మేటర్ తేలాల్సి
ఉంది. మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీ థియేటర్స్ రీ ఓపెన్ మీద క్లారిటీ రానుంది. ఈ నెల
ముప్పు నుండి చిన్న సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే
ఇప్పడు అందరి చూపు టక్ జగదీష్ పైనే ఉన్నాయి. ఈ సినిమాను డైరెక్ట్ గా OTT లో రిలీజ్
చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి మాత్రం
ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందా ? లేదా OTT ద్వారా
ఇంట్లోకే వచ్చేస్తుందా ? అనేది తెలియక మేకర్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు
నాని ఫ్యాన్స్. నిజానికి ఇది మంచి ఎమోషన్స్ తెరకెక్కిన ఫ్యామిలీ సినిమా అని ఫ్యామిలీ
అంతా కలిసి చూడాలని ప్రమోషన్స్ లో చెప్పారు యూనిట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ
థియేటర్స్ కి రావడం కష్టమని భావించి OTT రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment