హీరోలంతా 2-3 సినిమాలు లైన్లో పెట్టారు. ఒక సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో 2 సినిమాలకు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తున్నారు. చివరికి మహేష్ బాబు లాంటి హీరో కూడా ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడంటే హీరోలంతా ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైమ్ లో కూడా తాపీగా ఉన్నాడు వెంకటేష్. అవును.. వెంకీ చేతిలో ఎఫ్3 మినహా మరో సినిమా లేదు.
నారప్ప సినిమాను పూర్తిచేసి విడుదలకు
సిద్ధం చేశాడు వెంకీ. దీంతో పాటు దృశ్యం-2 సినిమాను కూడా పూర్తిచేశాడు. ఈ రెండు సినిమాలు
త్వరలోనే డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇవి కాకుండా ఎఫ్3 సినిమాను కూడా
క్లైమాక్స్ కు తీసుకొచ్చాడు. అయితే ఎఫ్3 తర్వాత సినిమా ఏంటనేది మాత్రం చెప్పలేకపోతున్నాడు.
నిజానికి వెంకీ చేతిలో మరో 2 ప్రాజెక్టులు
పెండింగ్ లో ఉన్నాయి. తరుణ్ భాస్కర్ తో సినిమా చాన్నాళ్లుగా నలుగుతోంది. కానీ ఆ సినిమా
ఇంకా ఫైనలైజ్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు వెంకటేష్. ఇక త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాకు
ఇంకా చాలా టైమ్ ఉందంటూ రియాక్ట్ అయ్యాడు. సో.. ప్రస్తుతానికి ఎఫ్3 మినహా వెంకీ చేతిలో
మరో సినిమా లేదు.
అయితే లైనప్ విషయంలో విక్టరీని తక్కువ
అంచనా వేయడానికి వీల్లేదు. ఇలా సినిమా ఎనౌన్స్ చేసి అలా సెట్స్ పైకి తీసుకొచ్చి, అంతే
వేగంగా సినిమాల్ని పూర్తిచేస్తాడు ఈ సీనియర్ హీరో. కాబట్టి ఎఫ్3 పూర్తయ్యేలోపు వెంకటేశ్
నుంచి కొత్త సినిమాల ప్రకటన రావడం ఖాయం. మిగతా హీరోలకు పోటీ ఇవ్వడం అంతకంటే ఖాయం.
No comments:
Post a Comment