మరికొన్ని గంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు రానుంది. ఈ సందర్భంగా సర్కారు వారి పాట నుండి #SuperStarBirthdayBLASTER అనే పేరుతో ఓ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు యూనిట్. మరో వైపు ఆగస్ట్ 13న 'పుష్ప' నుండి ఫస్ట్ సింగిల్ రానుంది. దాకో దాకో మేక అంటూ దేవి కంపోజ్ చేసిన సాంగ్ ని #PushpaFirstSingle గా రిలీజ్ చేయబోతున్నారు.
ఇటు మహేష్ అటు బన్నీ ఇద్దరూ రెండు సినిమాల అప్డేట్స్ తో ప్రస్తుతం
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ఆగస్ట్ 9న మహేష్ , ఆగస్ట్ 13న అల్లు అర్జున్
ఇద్దరూ సోషల్ మీడియాని షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రెండు రోజులు ట్విట్టర్
లో ట్వీట్ల మోత మొగనుంది. మరి మహేష్ బ్లాస్టర్ , అల్లు అర్జున్ సాంగ్ ఎన్ని ట్వీట్స్
, వ్యూస్ అందుకుంటాయో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఇక మహేష్ బర్త్ డే రోజు ట్విట్టర్ స్పేస్ కండక్ట్ చేస్తున్నారు.
అందులో సినీ ప్రముఖులంతా హాజరై మహేష్ పై తమ ప్రేమని చాటుకోనున్నారు. అంటే ఉదయం బ్లాస్టర్
తో మొదలైన మహేష్ హంగామా సాయంత్రం స్పేస్ తో ఎండ్ అవ్వనుంది. ప్రస్తుతం మహేష్ , అల్లు
అర్జున్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment