సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. రైటర్ కోన వెంకట‌్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గల్లీరౌడీ సెప్టెంబర్ 3న విడుదల కావడం లేదు.
దీని గురించి మేకర్స్ మాట్లాడుతూ ‘‘మా గల్లీరౌడీ’ని ముందుగా సెప్టెంబర్
3న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ఆ రోజున బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలు కూడా ఎక్కువగా
పోటీపడుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి, ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు
సినిమా థియేటర్స్‌కు ధైర్యంగా వచ్చి సినిమాలను ఆదరిస్తున్న తరుణంలో, మంచి రిలీజ్
డేట్ కోసం ఆగితే మంచిదనే అభిప్రాయం కలిగింది. ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ అందరి మధ్య
ఉండాలని భావించాం. అందువల్ల మా సినిమాను ఇంతకు ముందు ప్రకటించినట్లు సెప్టెంబర్
3న విడుదల చేయడం లేదు. సెప్టెంబర్‌లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని, త్వరలోనే
ఆ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం
సెప్టెంబర్ 3కి చాలా పోటీ ఉంది. అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల
అందగాడు, డియర్ మేఘ సినిమాలు వస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా గోపీచంద్ హీరోగా నటించిన
సీటీమార్ సినిమా వస్తోంది. దీంతో ఆ తేదీ నుంచి తప్పుకోవడమే బెటర్ అని భావించింది గల్లీ
రౌడీ యూనిట్. అన్నీ అనుకున్నట్టు కుదిరితే సెప్టెంబర్ మూడో వారంలో ఈ సినిమా థియేటర్లలోకి
వచ్చే అవకాశం ఉంది.
రాజేంద్ర ప్రసాద్, బాబీ సిమ్హా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు చౌరస్తా రామ్,
సాయికార్తీక్ కలిపి సంగీతం అందించారు. టీజర్ పెద్ద హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు
పెరిగాయి.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/sundeep-kishans-gully-rowdy-postpones-again-193811/
No comments:
Post a Comment