సినిమా వేడుకల్లో హీరో కాన్ఫిడెంట్ గా స్పీచ్ ఇస్తే ఆ వీడియో వైరల్ అవ్వడం ఖాయం. తాజాగా హీరో విశ్వక్ సేన్ స్పీచ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారింది. నరేష్ అనే కొత్త దర్శకుడితో దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ నిర్మాణంలో 'పాగల్' అనే సినిమా చేశాడు విశ్వక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్స్ లోకి రానుంది.
రిలీజ్ కి మరో రెండు రోజులే ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు
చేశారు మేకర్స్. ఈవెంట్ లో అందరి స్పీచులు ఆకట్టుకున్నాయి. కానీ హీరో విశ్వక్ సేన్
స్పీచ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. "సినిమా చూసి మాట్లాడుతున్నాను. జనరల్ గా
అన్ని సినిమాలు ఫ్రైడే రిలీజ్ అవుతాయి. కానీ ఇది పాగల్ కాబట్టి శనివారం రిలీజవుతుంది.
శనివారం పార్టీలు బార్లల్లో , పబ్బుల్లోనే కాదు నా థియేటర్స్ లో కూడా అవుతాయి. వచ్చేయండి
చూసుకుందాం. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నావ్ కరెక్టేనా ? అని కొంత మంది
అడిగారు. దానికి నేను చెప్పే సమాధానం ఒక్క్కటే. సర్కస్ లో సింహంతో ఎవ్వడైనా ఆడుకుంటాడు.
నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. మూసుకున్న థియేటర్స్ కూడా తెరిపిస్తా అమ్మతోడు.మాములుగా
ఉండదు సినిమా. పేరు విశ్వక్ సేన్ తప్పైతే మార్చుకుంటా" అంటూ కాన్ఫిడెంట్ గా మాట్లాడి
సినిమాపై అంచనాలు పెంచేశాడు హీరో.
అయితే ఈవెంట్ లో విశ్వక్ సేన్ స్పీచ్ మరీ ఓవర్ గా ఉందని కొందరు
ట్రోల్ చేస్తుంటే మరికొందరు మాత్రం సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ తనతో అలా మాట్లాడించి
కాబోలు అంటూ సమర్థిస్తున్నారు. ఏదేమైనా ఈవెంట్ లో ఈ కుర్ర హీరో ఎనర్జిటిక్ స్పీచ్ మాత్రం
స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
No comments:
Post a Comment