Tuesday, April 20, 2021

Cinema Halls Shutdown From Tomorrow In Telangana| Zee Cinemalu News Updates

 టాలీవుడ్ పై మరోసారి కరోనా తన ప్రభావం చూపించింది. సెకెండ్ వేవ్ దెబ్బకు షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అత్యవసరం అయితే తప్ప షూటింగ్స్ చేయొద్దని నిర్మాతలు-హీరోలకు విజ్ఞప్తి చేసింది. మరీ అత్యవసరం అనుకుంటే.. 50 మంది సిబ్బందితో మాత్రమే పనిచేసుకోవాలని సూచించింది. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్త చర్యగా నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అంతటా రేపట్నుంచి థియేటర్లు మూసేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్సులన్నీ మూతపడబోతున్నాయి.

అయితే పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు మాత్రం కొద్దిగా మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సినిమాకు వీకెండ్ వరకు టైమ్ ఇచ్చారు. అది కూడా కొన్ని సెలక్టివ్ థియేటర్లలో మాత్రమే వకీల్ సాబ్ వీకెండ్ వరకు నడుస్తుంది. వచ్చే వారం నుంచి సినిమాను కూడా ఆపేస్తున్నారు.

తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంతో వీకెండ్ రిలీజ్ అవ్వాల్సిన ఇష్క్ సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించకుండానే వాయిదా వేశారు. సినిమాతో పాటు వీకెండ్ 6 సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. వాటిని రిలీజ్ చేస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

కరోనా మరోసారి విజృంభించడంతో చిరంజీవి మరోసారి ముందుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో కార్యక్రమాన్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లలో ఆక్యుపెన్సీని 50శాతానికి కుదిస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టాలీవుడ్ లో షూటింగ్స్ తో పాటు సినిమా రిలీజెస్ అన్నీ ఒక్కసారిగా ఆగినట్టయింది.

 Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/cinema-halls-shutdown-from-tomorrow-in-telangana-188420/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...