Wednesday, April 21, 2021

Will Tollywood Rrr Movie Postpones Again | Zee Cinemalu News Telugu

 మోస్ట్ ఎవైటింగ్ మల్టీస్టారర్ సినిమా ‘RRR’ రిలీజ్ మళ్ళీ వాయిదా పడనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుందిఎన్టీఆర్రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాది సంక్రాంతి కి సినిమా థియేటర్స్ లో ఉండాలి. కానీ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా సినిమాను అక్టోబర్ లో దసరా బరిలో నిలిపారు మేకర్స్.

అయితే ఇప్పుడు డేట్ కి కూడా సినిమా రావడం కష్టమే అనే టాక్ గట్టిగా వినబడుతుంది.

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి. మరోవైపు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఇక మహారాష్త్ర లాంటి రాష్ట్రాల్లో కరోన వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ పెట్టారు. ఇక RRR కి సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కి ఆరు నెలలపైనే కావాలి.

 ఇవన్నీ దాటి సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో రావాలనుకున్నా పాన్-ఇండియా రిలీజ్ కోసం, మిగతా స్టేట్స్ లో కూడా పరిస్థితులు సెట్ అవ్వాలి. ఎందుకంటే రాజమౌళి తీసినబాహుబలిఫ్రాంచైజీ నార్త్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. బాలీవుడ్ లో సినిమాలకు రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. అందుకే రాజమౌళి నుండి వస్తున్న సినిమాపై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో కూడా RRR బాగా కలెక్ట్ చేయాలి లేదంటే బయ్యర్స్ నష్టపోతారు.

 ఇలా RRR ముందు చాలానే చిక్కులు ఉన్నాయి. మరి ఇవన్నీ దాటి సినిమా ఏడాది రిలీజ్ అవ్వడం కుదరని పని అనిపిస్తుంది. అందుకే మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇంకా రిలీజ్ పై పూర్తి క్లారిటీ లేదు కానీ ఆల్మోస్ట్ సినిమా సంక్రాంతికే వస్తుందని మాత్రం ప్రచారం జరుగుతుంది. చూడాలి మేకర్స్ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో.

 Read More: http://www.zeecinemalu.com/news-gossip/will-rrr-postpones-again-188490/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...