Wednesday, April 21, 2021

Nanis Shyam Singha Roy Final Schedule In 6 Cr Worth Massive Set In Hyderabad | Zee Cinemalu News

న్యాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.

 

తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల..కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపు థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

 

ద‌ర్శ‌కుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్‌ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త‌న గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు.

 

సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ టిస్తోన్న చిత్రాన్ని

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్బోయనపల్లి రూపొందిస్తున్నారు.

 

నిహారిక ఎంటర్టైన్మెంట్ తాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి సత్యదేవ్జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషల్ అవార్డ్ విన్నర్ నవీన్నూలి సినిమాకు ఎడిటర్గా వర్క్చేస్తున్నారు.

 

సాంకేతిక నిపుణులు

డైరెక్టర్‌: రాహుల్సంకృత్యాన్

నిర్మాత: వెంకట్బోయనపల్లి

బ్యానర్‌: నిహారిక ఎంటర్టైన్మెంట్

ఒరిజినల్స్టోరీ: సత్యదేవ్జంగా

మ్యూజిక్డైరెక్టర్‌ : మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: ను జాన్వర్గీస్

ప్రొడక్షన్డిజైనర్‌: అవినాష్కొల్ల

ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్‌: ఎస్‌ .వెంకటరత్నం (వెంకట్‌)

ఎడిటర్‌: నవీన్నూలి

 

Read More: http://www.zeecinemalu.com/news-gossip/nanis-shyam-singha-roy-final-schedule-in-6-5-cr-worth-massive-set-in-hyderabad-188424/ 

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...