ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టేసారు. తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్గ్యూ పెట్టారు. ఈ ఎఫెక్ట్ తో థియేటర్స్ కూడా మూతబడ్డాయి. అందుకే కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేసే ఆలోచనను విరమించుకుంటూ ఓటిటి వైపు మొగ్గుచూపుతున్నారు మేకర్స్. ఇక అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా కూడా OTT లో రిలీజ్ చేస్తున్నారు. ముందుగా సినిమాను ఈ నెల 30న థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ వెంటనే OTT లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియక మేకర్స్ మరియు OTT టీం కలిసి మే 7న డైరక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
ఇక అనసూయ సినిమాతో పాటే మిగతా సినిమాలు కూడా మెల్లగా OTT బాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సినిమా తీసి రిలీజ్ కి రెడీ చేసిన మేకర్స్ కి ఓటిటి నే బెస్ట్ ఆప్షన్ గా మారింది. నిజానికి కరోన ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్కొక్కటిగా వరుస సినిమాలు నేరుగా ఆడియన్స్ ఇంట్లోకి వచ్చేశాయి. లాక్ డౌన్ అనంతరం కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజై మంచి విజయాలు అందుకోవడంతో ఇక మిగతా సినిమాలు థియేటర్స్ వైపు చూశాయి.
మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా మెల్లగా OTT లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇటివలే రిలీజ్ వరకూ వచ్చి ఆగిపోయిన ఇష్క్ లాంటి మిగతా చిన్న సినిమాలు కూడా డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ సెకండ్ వేవ్ లో ఎన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి ద్వారా విడుదలవుతాయో ఎలాంటి హిట్స్ సాధిస్తాయో చూడాలి.
ఏదేమైనా థియేటర్స్ మూతతో ఎఫెక్ట్ అవుతున్న చిన్న నిర్మాతలకు OTT అనేది బెస్ట్ ఆల్టర్నేట్ అనిపిస్తుంది.
No comments:
Post a Comment