Monday, April 26, 2021

Mahesh Trivikram Movie Announcement Soon | Zee Cinemalu Movie News Updates

 మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన మహేష్ -త్రివిక్రమ్ కాంబో సినిమాకు సంబంధించి ఎట్టకేలకు ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాను వచ్చే నెల మే31న ఎనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్.

ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ప్రతీ ఏడాది ఆ డేట్ కి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ వస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ కి ఉన్న కొన్ని సెంటిమెంట్స్ లో తండ్రి పుట్టిన రోజు కూడా ఒకటి. అందుకే మహేష్ సూచన మేరకూ మేకర్స్ ఈ డేట్ కి ఎనౌన్స్ మెంట్ ఫిక్స్ అయ్యారట. అన్ని అనుకున్నట్లు జరిగితే అదే రోజు ఉదయం సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికీ రెండు సినిమాలొచ్చాయి. వాటిలో 'అతడు' క్లాసిక్ అనిపించుకోగా 'ఖలేజా' బోల్తా కొట్టింది. తమ కాంబోలో మూడో సినిమా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఫ్యాన్స్ కి చాలా సార్లు మాటిచ్చారు మహేష్ -త్రివిక్రమ్. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మూడో సినిమా కోసం కలుస్తుంది ఈ కాంబో.

ఇప్పటికే మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన త్రివిక్రమ్.. స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని సమాచారం. ఇప్పటికే క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే యాక్టర్స్ ని సెలెక్ట్ చేసే పనిలో త్రివిక్రమ్ అండ్ టీం బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్స్ గా పూజా హెగ్డే తో పాటు కియరా అద్వాని ని కూడా తెసుకున్నట్లు ఇన్సైడ్ టాక్.

ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. సినిమాకు సంబంధించి ఇంకా చాలా షూట్ బ్యాలెన్స్ ఉంది. అందుకే సినిమాతో పాటే త్రివిక్రమ్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడట మహేష్. జూన్ లేదా జులై నుండి క్రేజీ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్, GMB ఎంటర్టైన్ మెంట్స్ బేనర్లు సినిమాను నిర్మిస్తాయని టాక్. ఇక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఫిక్స్. త్రివిక్రమ్-తమన్ కాంబోలో రానున్న మూడో సినిమా ఇది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/mahesh-trivikram-movie-announcement-soon-188586/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...