Wednesday, April 28, 2021

Darling Prabhas Nag Ashwin Movie Launch Details | Zee Cinemalu Movie Updates

 ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఎనౌన్స్ మెంట్ నుండే అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసిన కాంబో సినిమా ఇంకా ఆలస్యం అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా జూన్ లేదా జులై లో రెగ్యులర్ షూట్ జరుపుకోవాలి. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా ఉండటంతో ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తన చేతిలో ఉన్న 'సలార్', 'ఆది పురుష్' సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. రెండు కొలిక్కి వచ్చాకే ప్రభాస్ -నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుంది.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమా ఏడాది దీపావళికి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. లాంచ్ అయిన అదే నెలలో లేదా డిసెంబర్ నుండి సినిమా షూట్ జరుపుకోనుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో బిగ్ బీ అమితాబ్ ముఖ్య పాత్రలో నటిస్తుండడం విశేషం.

ఇక సినిమాలో ఉండే మరికొన్ని క్యారెక్టర్స్ కి కూడా ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని టాక్ ఉంది. ఇప్పటికే ప్రభాస్ లుక్ ఫిక్స్ చేసి క్యారెక్టర్స్ కి కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయిస్తున్నారట. ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా దాదాపు ఏడాదిన్నర పైనే షూట్ జరుపుకోనుందని అంటున్నారు. అందుకే లోపు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట ప్రభాస్. సో కాంబో సినిమా 2022 లో రావడం కష్టమే అంటున్నారు. చూడాలి ప్రచారంలో ఉన్నట్టు సినిమా షూట్ కి అంత సమయం పడుతుందా ? లేదా అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సినిమాను రిలీ చేస్తారా ?

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/prabhas-nag-ashwin-movie-launch-details-188679/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...