Saturday, April 17, 2021

Corona Effect On Tollywood - షూటింగ్స్ కి బ్రేక్ | Zee Cinemalu Movie Updates

 గతేడాది కరోన ఎఫెక్ట్ తో వాయిదా పడిన షూటింగ్స్ లాక్ డౌన్ తర్వాత మెల్లగా మొదలయ్యాయి. లాక్ డౌన్ అనంతరం కొన్ని నెలలుగా బడా సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ లాక్ అవ్వడంతో చకచకా షూట్ ఫినిష్ చేసుకుంటున్న సినిమాలపై మళ్ళీ కరోన ఎఫెక్ట్ పడింది. కోవిడ్ సెకండ్ వేవ్ పస్తుతం తీవ్రంగా ఉండటంతో నిన్నటి వరకు సెట్స్ పై ఉన్న సినిమాలు నేటి నుండి షూటింగ్ వాయిదా వేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో కూడా ఒకరి తర్వాత మరొకరిని వైరస్ ఎటాక్ చేస్తుండటం వకీల్ సాబ్ టీంతో పాటు తాజాగా పవన్ కళ్యాణ్ కి కూడా కోవిడ్  సోకడంతో మిగతా వాళ్ళు పరిస్థితుల్లో షూటింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ 'ఆచార్య' , అల్లు అర్జున్ 'పుష్ప' , మహేష్ 'సర్కారు వారి పాట'సినిమాలతో పాటు హైదరాబాద్ లో కొన్ని సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పుడు సినిమాలపై కూడా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది. రేపటి నుండి షూటింగ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇక షూటింగ్ అంటే కొన్ని వందల మంది పనిచేస్తారు. అందులో ఎవరికి వైరస సోకినా మిగతా వారికి ఈజీగా స్ప్రెడ్ అవ్వడం ఖాయంఅందుకే ప్రెజెంట్ యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ కూడా వారం రోజులు షూటింగ్ వచ్చే పరిస్థితి లేదని కరాఖండిగా చెప్పెస్తున్నారట.

ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో టాలీవుడ్ మెల్లగా కోలుకుంటోంది. మళ్ళీ షూటింగ్స్ పోస్ట్ పోన్ , రిలీజ్ లు వాయిదా , థియేటర్స్ మూసివేత అంటే ఇప్పుడే కోలుకున్న పరిశ్రమ మళ్ళీ నష్టాలు చూడాల్సి వస్తుంది. నెలతో పాటు వచ్చే నెల వరకూ సెకండ్ వేవ్ ప్రభావం గట్టిగా ఉంటుందని వ్యాప్తి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో కరోన కేసులు నమోదు అవుతున్నాయి. మరి టాలీవుడ్ మార్కెట్ పై కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో చూడాలి.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/corona-second-wave-effect-on-tollywood-188364/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...