Thursday, April 15, 2021

Venkatesh Wraps Up His Part Shooting Of Drushyam 2 | Zee Cinemalu Updates News

రీసెంట్ గా OTT లో విడుదలై పెద్ద విజయం సాధించిన మలయాళ సినిమా 'దృశ్యం 2' ను తెలుగులో అదే టైటిల్ తో వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ స్టార్టయిన సినిమాకు సంబంధించి తన పోర్షన్ కంప్లీట్ చేసేసాడు వెంకటేష్. జస్ట్ 45 రోజుల్లోనే వెంకీ సినిమాను ఫినిష్ చేయడంతో అందరూ సప్రయిజ్ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే పర్ఫెక్ట్ గా రెండు షెడ్యుల్స్ లో సినిమాను కంప్లీట్ చేసేలా ప్లాన్ వేసుకున్నారు మేకర్స్. ప్లానింగ్ ప్రకారమే హైదరాబాద్ లో ఒక షెడ్యుల్ కేరళలో మరో షెడ్యుల్ జరిపారు. తాజాగా జరిగిన కేరళ షెడ్యుల్ లో తనకి సంబంధించిన షూట్ పూర్తి చేసి హైదరాబాద్ చేరుకున్నాడు వెంకీ.

'ద్రిశ్యం' సినిమాను తెలుగులో 'దృశ్యం' గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ సీక్వెల్ తో మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమనిపిస్తుంది. మంచి కథ -ఆసక్తికరమైన కథనంతో సీక్వెల్ ని తెరకెక్కించిన జీతూజోసెఫ్ నే రీమేక్ కి కూడా దర్శకుడిగా ఎంచుకున్నారు నిర్మాత సురేష్ బాబు. సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు జీతూ.

ప్రస్తుతం మిగతా బ్యాలెన్స్ షూట్ ని కూడా నెలాఖరు కల్లా కంప్లీట్ చేసి జులై లేదా ఆగస్ట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటివలే 'నారప్ప' షూటింగ్ ఫినిష్ చేసిన వెంకీ ప్రస్తుతం F3 సినిమా చేస్తున్నాడు. లెక్కన చూస్తే వెంకటేష్ నుండి ఏడాది మూడు సినిమాలు విడుదల కానున్నాయి. మరి సినిమాలతో విక్టరీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/venkatesh-wraps-up-his-part-shooting-of-drushyam-2-meena-nadiya-188309/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...