ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నాత్తై కొత్త షెడ్యూల్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ షెడ్యూల్ కోసం చెన్నై నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చాడు. ఇందులో నటించాల్సిన నయనతార కూడా స్పెషల్ ఫ్లయిట్ బుక్ చేసుకుంది. కానీ అన్నాత్తై షూటింగ్ కోసం కాదు.
బబ్లీ
బ్యూటీ Nayanthara మరోసారి బ్రేక్ తీసుకుంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి తన
సొంత రాష్ట్రం కేరళ వెళ్లింది. Nayan-Vignesh కలిసి చెన్నై నుంచి కొచ్చికి స్పెషల్
ఫ్లయిట్ లో వెళ్లారు. అక్కడ్నుంచి లగ్జరీ కారులో నయన్ ఇంటికి చేరుకున్నారు. ఈ ఫొటోలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సౌత్ లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది
నయనతార. ఒక్కో సినిమాకు ఆమె మినిమం 3 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. కొన్ని సినిమాలకు
4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓవైపు ఇలా స్టార్ హీరోయిన్
గా కొనసాగుతూనే, మరోవైపు దర్శకుడు విఘ్నేష్ తో ఆమె డేటింగ్ చేస్తోంది.
అకేషన్
ఏదైనా రెగ్యులర్ గా వీళ్లు కలుసుకుంటారు. మరీ ముఖ్యంగా నయనతార ఇంట్లో జరుపుకునే ఫెస్టివల్స్
కు విఘ్నేష్ కచ్చితంగా ఎటెండ్ అవుతాడు. ఈసారి కూడా అలాంటి పండగ కోసమే ఇద్దరూ కలిసి
ఛార్టర్డ్ విమానం బుక్ చేసుకొని మరీ ఇంటికెళ్లిపోయారు.
ఈ
అకేషన్ పూర్తయిన వెంటనే నేరుగా హైదరాబాద్ వచ్చి రజనీకాంత్ తో కలిసి అన్నాత్తై షూటింగ్
లో పాల్గొంటుంది నయనతార. సూపర్ స్టార్ రీసెంట్ గా చేసిన దర్బార్ సినిమాలో కూడా ఈమెనే
హీరోయిన్.
No comments:
Post a Comment