డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ తక్కువ టైంలో హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న అడివి శేష్ నుండి మరో బెస్ట్ ఫిలిం రాబోతుంది. అవును టీజర్ తో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు శేష్. 'గూఢచారి' ఫేం శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో మేజర్ ఉన్ని కృష్ణన్ కథతో తెరకెక్కిన 'మేజర్' టీజర్ రిలీజైంది. నిమిషం ముప్పై నాలుగు సెకన్ల ఈ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
డిఫరెంట్
స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ తక్కువ టైంలో హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న
అడివి శేష్ నుండి మరో బెస్ట్ ఫిలిం రాబోతుంది. అవును టీజర్ తో ఆ ఇంపాక్ట్ క్రియేట్
చేశాడు శేష్. 'గూఢచారి' ఫేం శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో మేజర్ ఉన్ని కృష్ణన్ కథతో
తెరకెక్కిన 'మేజర్' టీజర్ రిలీజైంది. నిమిషం ముప్పై నాలుగు సెకన్ల ఈ టీజర్ ప్రస్తుతం
ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
టీజర్
ప్రారంభంలో మంటల్లో నిలుచున్న శేష్ షాట్ తో "మేజర్ సందీప్... డూ యు కాపీ మీ"
అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ లో వంశీ పచ్చిపులుసు
సినిమాటోగ్రఫీ , శ్రీ చరణ్ పాకాల స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సోల్జర్ అంటే
ఏమిటి అనే థీమ్ తో టీజర్ ని కట్ చేసి సినిమాలో ఉన్న కంటెంట్ తెలియజేస్తూ మేజర్ ఉన్ని
కృష్ణన్ చేసిన సాహసం గురించి క్రిస్పీగా చెప్పారు మేకర్స్. శేష్ తో పాటు సినిమాలో నటించిన
మిగతా నటుల క్యారెక్టర్స్ కూడా టీజర్ లో రివీల్ చేశారు. ప్రకాష్ రాజ్ , మురళి శర్మ
, రేవతి సినిమాలో కీ రోల్స్ లో కనిపించనున్నారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే
సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఉందని చెప్తూ కొన్ని రొమాంటిక్ షాట్స్ ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా
అబ్బూరి రవి అందించిన పవర్ డైలాగ్స్ టీజర్ కి మరింత బలం చేకూర్చాయి. "అక్కడ ఎంత
మంది ఉన్నారు ?" అంటూ మురళి శర్మ అడిగే ప్రశ్న కి సమాధానం చెప్తూ "Don't
Come up....i"ll handle them" అంటూ శేష్ చెప్పే డైలాగ్ టీజర్ లో మెయిన్ హైలైట్
గా నిలిచింది.
ఓవరాల్ గా 'మేజర్' టీజర్ చూస్తే 'గూఢచారి' తో సూపర్ హిట్ కొట్టిన హీరో అడివి శేష్,
డైరెక్టర్ శశి కాంబోలో 26/11 ముంబై ఎటాక్ ఇన్సిడెంట్ తో తెరకెక్కిన 'మేజర్' హై స్టాండర్డ్స్
క్వాలిటీతో తెరకెక్కిన కంటెంట్ ఉన్న సినిమా అని అర్థమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్
వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జులై 2న థియేటర్స్ లోకి రాబోతుంది. సోనీ పిక్చర్స్ ,
GMB Entertainments pvt ltd, A+S మూవీస్ బేనర్స్ పై తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో
రూపొందుతున్న ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
Read More : http://www.zeecinemalu.com/en/news-gossip/adivi-sesh-major-movie-teaser-talk-188031/
No comments:
Post a Comment