Monday, April 12, 2021

NTR Koratala Movie official Announcement | Zee Cinemalu Updates News

 నిన్నటివరకు NTR30 సినిమా చుట్టూ ఉన్న ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం లభించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ 30 సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాలి. కొన్ని రోజుల క్రితం ఎనౌన్స్ అయిన కాంబో షూట్ దగ్గరి వరకూ వచ్చి క్యాన్సల్ అయ్యింది. ఫైనల్ గా ఇప్పుడు తన లాండ్ మార్క్ మూవీని కొరటాల శివ చేతిలో పెట్టాడు తారక్. బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ #NTRKoratala2 సినిమాను ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువసుధ ఆర్ట్స్ సంస్థపై మిక్కిలినేని నిర్మించనున్న సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29 విడుదల అంటూ ఎనౌన్స్ మెంట్ తో పాటే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

గతంలో ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్'సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. మంచి సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పి సినిమాతో అందరినీ మెప్పించిన కాంబో ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అయితే "ఈసారి రిపేర్లు నేషనల్ లెవెల్ లో జరపబడును" అంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు మేకర్స్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తారక్ 'RRR' షూట్ పూర్తి చేసేలోపు చిరుతో కొరటాల శివ తీస్తున్న 'ఆచార్య' థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇద్దరు ఫ్రీ అవ్వగానే సినిమా పట్టాలెక్కనుంది. లోపు కొన్ని మీటింగ్స్ పెట్టుకొని కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకుంటాడు కొరటాల.

Read More : http://www.zeecinemalu.com/en/news-gossip/ntr-koratala-movie-official-announcement-yuva-sudha-ntr-arts-188042/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...