Thursday, April 8, 2021

Top 10 Reasons To Watch Vakeel Saab | Zee Cinemalu Latest Updates |Box Office

సినిమా రిలీజైనా ఫస్ట్ ఎదురయ్యే క్వశ్చన్, అస్సలు సినిమా ఎందుకు చూడాలి. 'వకీల్ సాబ్' విషయంలో ఇలాంటి ప్రశ్నలుండవు. ఎందుకంటే, అది పవర్ స్టార్ సినిమా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే.కానీ సినిమా ఎందుకు చూడాలో చెప్పడానికి టాప్-10 రీజన్స్ కూడా ఉన్నాయి.

వకీల్ సాబ్ ఎందుకు చూడాలో చెప్పే టాప్-10 రీజన్స్ లో మొదటి 5 రీజన్స్ కు ఆన్సర్ ఒకటే. దటీజ్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కేవలం PSPK కోసం మాత్రమే వకీల్ సాబ్ చూడాలి. మిగతా రీజన్స్ అన్నీ తర్వాతే.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్

లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ నటిస్తున్న సినిమా ఇది. వకీల్ సాబ్ చూడ్డానికి ఇంతకంటే పెద్ద రీజన్ అక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ పై పవన్ స్టయిల్, మేనరిజమ్స్ ను ఆడియన్స్ చాలా మిస్సయ్యారు. 'వకీల్ సాబ్' తో రీఎంట్రీ ఇస్తున్న పవన్.. ప్రేక్షకులకు మరోసారి ఫుల్ మీల్స్ అందించబోతున్నాడు.

రీమేక్ లో మార్పుచేర్పులు

పింక్ సినిమాకు రీమేక్ గా సినిమా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పింక్ లో ఇది ది బెస్ట్ వెర్షన్. మరీ ముఖ్యంగా PSPKను దృష్టిలో పెట్టుకొని చేసిన మార్పుచేర్పులు సినిమాకు మెయిన్ ఎస్సెట్ కానున్నాయి. హిందీ, తమిళ్ లో ఎవరైనా సినిమా చూసేసినప్పటికీ.. తెలుగు వెర్షన్ కు వాళ్లకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది పవన్ కల్యాణ్ కోసం చేసిన రీమేక్. రీమేక్ కు పవనిజం టచ్ ఇచ్చేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా కష్టపడ్డాడు.

తమన్

వకీల్ సాబ్ మూవీ ఎందుకు చూడాలనడానికి మరో రీజన్ తమన్. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న కంపోజర్.. వకీల్ సాబ్ కోసం ప్రాణంపెట్టాడు. పాటలతో ఇప్పటికే మెస్మరైజ్ చేసిన మ్యూజిక్ డైరక్టర్.. సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆఖరి నిమిషం వరకు బెటర్ మెంట్ కోసం కష్టపడ్డాడు. 'వకీల్ సాబ్' లో కచ్చితంగా తమన్ మార్క్ కనిపిస్తుంది.

దిల్ రాజు బ్రాండ్

సినిమాను గ్రాండియర్ గా తెరకెక్కించాలంటే దిల్ రాజు లాంటి నిర్మాత ఉండాలి. టేస్ట్ తో పాటు పక్కా ప్లానింగ్ ఉన్న నిర్మాత, వకీల్ సాబ్ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. పవర్ స్టార్ కోసం ఖర్చుకు వెనకాడకుండా డబ్బులు పెట్టాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లోనే ది బెస్ట్ మూవీగా'వకీల్ సాబ్' నిలిచిపోవడం కోసం చాలా కష్టపడ్డాడు. దిల్ రాజు బ్రాండ్ 'వకీల్ సాబ్' కు యాడెడ్ అడ్వాంటేజ్.

అంజలి-అనన్య-నివేత థామస్

సినిమాకు మరో ఎడ్వాంటేజ్ అంజలి, అనన్య, నివేత థామస్. 3 కీలక పాత్రల కోసం ముగ్గుర్ని తీసుకున్నాడు దర్శకుడు వేణుశ్రీరామ్. పాత్రలకు వీళ్లు పెర్ ఫెక్ట్. జనరేషన్ అమ్మాయిగా నివేత, అమాయకమైన పిల్లగా అనన్య, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిగా అంజలి.. వకీల్ సాబ్ సినిమాతో అందర్నీ ఎట్రాక్ట్ చేయబోతున్నారు.

శృతిహాసన్

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. శృతిహాసన్. సినిమా కోసం చేసిన ఛేంజెస్ వల్ల శృతిహాసన్ క్యారెక్టర్ వకీల్ సాబ్ కు యాడ్ అయింది. పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ తెరపై తన మార్క్ చూపించింది శృతిహాసన్. పవర్ స్టార్ తో ఆమె కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై చూసి తీరాల్సిందే.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/pawan-kalyans-vakeelsaab-top10-attractions-dilraju-sriramvenu-anjali-nivetha-thomas-ananya-187771/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...