Check Out For Zee Cinemalu Tollywood Movie Updates : http://www.zeecinemalu.com/
అల్లు
అర్జున్ -సుకుమార్ కాంబినేషణ్ లో సినిమా వస్తుందనే వార్త బయటికొచ్చినప్పటి నుండి 'పుష్ప' పై భారీ అంచనాలు
మొదలయ్యాయి. పోస్టర్స్ ద్వారా సినిమాలో బన్నీ మాస్ లుక్ ఎలా ఉంటుందో చూపించిన మేకర్స్
ఇప్పుడు పుష్ప రాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రుచి చూపిస్తూ టీజర్ వదిలారు. అల్లు
అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా Introducing Pushpa Raj పేరుతో రిలీజ్ చేసిన టీజర్
ప్రస్తుతం అటు బన్నీ ఫ్యాన్స్ కి పునకాలు తెప్పిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
పుష్ప రాజ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ కొన్ని
యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంది.
టీజర్ లో సుకుమార్ టేకింగ్ , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు బ్రోజెక్ విజువల్స్,
యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. రష్మిక లుక్ కూడా టీజర్ లో రివీల్ చేయడంతో పాటు
సినిమాలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేసేలా హింట్ ఇచ్చారు.
ముఖ్యంగా
ఎర్రచందనంని తరలించే టాప్ షాట్స్ , అలాగే అడవి విజువల్స్ టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్స్.
ఇక టీజర్ ఎండింగ్ లో బన్నీ ఓ రౌడీని కొట్టి నీళ్ళలో ముంచి అతని పై కూర్చున్న షాట్ అభిమానుల
రోమాలు నిక్కపోడిచేలా ఉంది.
ఓవరాల్ గా సినిమాలో బన్నీ -సుక్కు కాంబినేషణ్ లో
ఏ రేంజ్ మాస్ సినిమా రాబోతుందో విజువల్స్ తో తెలియజేస్తూ సినిమాపై భారీ హైప్
క్రియేట్ చేశారు మేకర్స్.
No comments:
Post a Comment