వకీల్ సాబ్ వేడి మొదలైంది. ఇప్పటికే కళ్లుచెదిరే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. కరోనా తర్వాత సోలోగా వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కాగా.. లాక్ డౌన్ తర్వాత హయ్యస్ట్ థియేటర్లలో వస్తున్న సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమాకు వందకు పైగా స్క్రీన్స్ కేటాయించారు. ప్రస్తుతానికి కౌంట్ 109. మరో 3 రోజుల్లో ఈ స్క్రీన్ కౌంట్ మరో 15 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 70శాతం థియేటర్లు వకీల్ సాబ్ కే ఎలాట్ చేశారు. ఆంధ్రా, ఓవర్సీస్ లో కూడా వకీల్ సాబ్ రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే కరోనా పరిస్థితుల మధ్య వీటికి ప్రత్యేక అనుమతి వస్తుందా రాదా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
వకీల్ సాబ్ కు సంబంధించి చిన్న ఫొటో నుంచి ట్రయిలర్ వరకు ప్రతి ఎలిమెంట్ సూపర్ హిట్టవుతూ వస్తోంది. సోషల్ మీడియాలో నంబర్-1 ట్రెండింగ్స్ లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. హయ్యస్ట్ థియేటర్స్ కౌంట్ కూడా యాడ్ అవ్వడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో వకీల్ సాబ్ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.
Read Article:- http://www.zeecinemalu.com/news-gossip/highest-theatres-for-vakeel-saab-pawan-kalyan-shruti-hassan-187334/

highest theatres for vakeel saab, latest movie news, vakeel saab, vakeel saab hyderabad theatres, vakeel saab theatres list, zee cinemalu latest news
ReplyDelete