Monday, April 5, 2021

VakeelSaab ఎక్కువ కష్టపడిన సినిమా | Zee Cinemalu News Telugu Lo | Telugu Film Nagar

‘వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ మెయిన్ హైలైట్ గా నిలిచింది.  “కెరీర్ లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘వకీల్ సాబ్ అంటూ చెప్పిన పవన్ ముందు ఈ క్యారెక్టర్ చేయగలనా ? అనుకున్నానని ఈ పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” మూడు సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అనే భావన కలగలేదు. ఎప్పుడూ నా మనసు, హృదయం దేశం కోసం, మీ కోసం కొట్టుకుంటాయి. ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం చదివినా దేశం కోసమే అనిపిస్తుంటుంది. కాబట్టి మూడు సంవత్సరాలు నేను సినిమాకు దూరంగా ఉన్నానంటే ఆ కాలం నాకు తెలియలేదు. సినిమా పరిశ్రమకు వచ్చి 24 ఏళ్లవుతుంది అని మీరు అంటుండగా వినడమే గానీ నాకు అసలు గుర్తు లేదు. పని చేసుకుంటూ వెళ్లిపోయాను గానీ తెలియదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత స్థానానికి వెళ్లిన నిర్మాత దిల్ రాజు నాతో సినిమా చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.

Read Article : - http://www.zeecinemalu.com/news-gossip/pawan-kalyan-about-vakeelsaab-movie-dilraju-venusriram-anjali-nivetha-thomas-ananya-187559/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...