ప్రస్తుతం
OTT లకి ప్రేక్షకులు మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. ఇక కొన్ని సినిమాలు కేవలం
OTT కోసమే తీస్తుండటం కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిన సినిమాలు
కూడా OTT బాట పడుతున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థతో పాటు ఎగ్జిబ్యూటర్స్
ఇబ్బంది పడుతున్నారు. ఇకపై బడా సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్
లోనే రిలీజ్ అయితే తమ పరిస్థితేంటి ? అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.
అయితే
ఈ విషయంపై తాజాగా బడా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సినిమాల OTT రిలీజ్ గురించి
ఇటివలే ఆయనకీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైంది. అగ్ర నిర్మాతగా మీరు థియేటర్ కి ఇంపార్టెన్స్
ఇస్తారా ? లేదా OTT కి ఇంపార్టెన్స్ ఇస్తారా ? అనే ప్రశ్న కి సమాధానం చెప్తూ తను ఎప్పుడూ
థియేటర్స్ కే ఓటు వేస్తానని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సినిమాలు
OTT కోసం తీస్తున్న మాట నిజమే అని అలా డిజిటల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా
కచ్చితంగా OTT లోనే రిలీజ్ చేయాలని అలాగే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తీసిన సినిమా
అయితే వెయిట్ చేసి సినిమా హాల్స్ లోనే విడుదల చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇక
కొందరు నిర్మాతలు థియేటర్ కోసం తీసిన సినిమాను డైరెక్ట్ గా ఓ టి టి లో రిలీజ్ చేస్తుండటంపై
కూడా అల్లు అరవింద్ మాట్లాడారు. కొందరు నిర్మాతలు వారికి ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందుల
వల్ల సినిమాలను డైరెక్ట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేస్తున్నారని అది వారి వ్యక్తిగత
విషయమని చెప్పారు. సో అగ్ర నిర్మాత ఫైనల్ గా థియేటర్స్ కే ఓటు వేసి OTT కోసం తీసిన
సినిమాలు, అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న సినిమాలు మాత్రమే ఓ టి టి లో విడుదలవుతాయని
వ్యక్తం చేశారు.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/allu-aravind-responds-on-ott-movies-189516/
No comments:
Post a Comment