ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 'బాలయ్య 'అఖండ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇంకా ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత గోపి చంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఆ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కరోన ప్రభావం తగ్గి షూటింగ్స్ మొదలవ్వగానే ఈ ఈ కాంబో సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్స్ కి కాస్టింగ్ ని ఫైన చేసిన పనిలో ఉన్నాడు గోపీచంద్.
సినిమాలో
బాలయ్య సరసన హీరోయిన్ గా త్రిష ని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది. మొన్నటివరకు ఈ
ప్లేస్ లో శృతి హాసన్ ని అనుకున్నారు. క్రాక్ సెంటిమెంట్ తో మళ్ళీ శృతి రిపీట్ చేయాలనుకున్నాడు
దర్శకుడు కానీ శృతి ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తుంది. ఆ సినిమాకు బల్క్
డేట్స్ ఇచ్చేసింది. అందుకే ఇప్పుడు శృతి హాసన్ ప్లేస్ లో త్రిషని తీసుకోనున్నారని సమాచారం.
బాలయ్య
-త్రిష కాంబినేషన్ లో ఆరేళ్ళ క్రితం 'లయన్' అనే సినిమా వచ్చింది. సినిమాలో వీరిద్దరి
కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. పైగా తెలుగులో త్రిష కి క్రేజ్ కూడా ఉంది. అందుకే
కొందరు సీనియర్ హీరోయిన్స్ ని లిస్టు అవుట్ చేసి ఫైనల్ త్రిష ని ఎంచుకున్నారట. మైత్రి
మూవీ మేకర్స్ బేనర్ పై మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎనౌన్స్
మెంట్ త్వరలోనే రానుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
No comments:
Post a Comment