కొన్ని క్యారెక్టర్స్ నటులను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసి వారి సినిమా విజయంలో కీలక రోల్ పోషిస్తుంటాయి. రంగస్థలం సినిమాతో నటిగా అలాంటి రెస్పాన్సే అందుకుంది అనసూయ. అప్పటి అనసూయ వేరు ఆ సినిమా తర్వాత వచ్చిన ఇమేజ్ వేరు. అవును సినిమా రిలీజై మూడేళ్ళవుతోంది కానీ ఇప్పటికి అనసూయ ని రంగమ్మత్త అనే పిలుస్తుంటారు ఫ్యాన్స్. అయితే అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే మరో రోల్ తో రంగమ్మత్త పాత్రను మరిపించేలా రాబోతుంది అనసూయ.
అల్లు
అర్జున్ -సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో ఓ కీ రోల్ చేస్తుంది అనసూయ. ఈ సినిమా
గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకుంది. పాత్ర తాలూకు విషయాలు బయటపెట్టకుండా సినిమాలో
తన పాత్ర అందరికీ గుర్తుండి పోయేలా ఉండనుందని చెప్పింది. ఇటివలే తన పోర్షన్ షూట్ కంప్లీట్
చేశానని, తనపై తీసిన సనివేశాలు చాలా బాగా వచ్చాయని చెప్పుకుంది. బన్నీ తో స్క్రీన్
షేర్ చేసుకోవడం మంచి అనుభూతి ఇచ్చిందని అంటోంది. అలాగే తనను నమ్మి మళ్ళీ మరో మంచి పాత్రను
ఇచ్చిన సుకుమార్ గారికి థాంక్స్ అంటూ తెలియజేసింది. అయితే సినిమాలో తన పేరు ఏంటనేది
చెప్పలేదు హాట్ యాంకర్.
పుష్పలో
సునీల్ , రావు రమేష్ పాత్రల తర్వాత అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అనసూయ
దే అని తెలుస్తుంది. రంగస్థలం మాదిరిగానే ఇందులో కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ క్రియేట్
చేసి వాటితో అదిరిపోయే సన్నివేశాలు రాసుకున్నాడట సుక్కు. మరి పుష్ప రిలీజ్ తర్వాత ఈ
పాత్ర అనసూయ కి ఎంత పేరు తెచ్చిపెడుతుందో ? రంగమ్మత్త పాత్రను మైమరిపించేలా ఉంటుందా
? వేచి చూడాలి.
No comments:
Post a Comment