పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'సలార్' నుండి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని అందులో ఓల్డ్ మెన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే సలార్ లో ఇప్పటికే ఒక లుక్ బయటకొచ్చేసింది. షూటింగ్ జరుగుతున్న టైంలో వర్కింగ్ స్టిల్స్ బయటికొచ్చాయి.
నిజానికి
ప్రభాస్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే ఆ ఓల్డ్ మెన్ క్యారెక్టర్ కోసమని ఇన్సైడ్
టాక్. మొన్నటి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు కరోన సెకండ్ వేవ్ బ్రేక్
వేసింది. దీంతో షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే మరో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తుంది
యూనిట్. ఆ షెడ్యుల్ లో ప్రభాస్ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారు. పవర్
ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్
కానుంది.
గతంలో
బిల్లా సినిమాలో డబుల్ రోల్స్ చేశాడు ప్రభాస్. అందులో బిల్లా అనే డాన్ రోల్ లో స్టైలిష్
గా కనిపిస్తూనే మరోవైపు రంగా అనే మాస్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇక బిల్లాగా అభిమానులతో
పాటు ఆడియన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసి ప్రభాసా మజాకా అనిపించాడు. ఇప్పుడు సరిగ్గా సలార్
విషయంలో కూడా అదే జరగనుందని అంటున్నారు. ఇందులో ఓల్డ్ మెన్ పాత్ర అందరినీ ఎట్రాక్ట్
చేస్తూ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్. మరి సలార్ లో ప్రభాస్ నిజంగానే రెండు
పాత్రల్లో నటిస్తున్నాడా ? ఓల్డ్ క్యారెక్టర్ ప్రచారం నిజమేనా ? అనేవి తెలియాల్సి ఉంది.
మరోవైపు
ఈ ఓల్డ్ డాన్ పాత్ర కోసం చిరంజీవిని సంప్రదించినట్టు కూడా రూమర్స్ వచ్చాయి. వీటిని
మెగా కాంపౌండ్ తోసిపుచ్చింది. సలార్ యూనిట్
నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ చిరంజీవిని వచ్చి కలవలేదని స్పష్టంచేసింది.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/chiranjeevi-in-prabhass-salaar-189233/
No comments:
Post a Comment