ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కు ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్య్యూ ఇచ్చాడు ఎన్టీఆర్. RRR మూవీతో పాటు తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా కొరటాల శివ సినిమా గురించి ఏమన్నాడో చూద్దాం.
"RRR
తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాను. ఆల్రెడీ ఎనౌన్స్ మెంట్ ఇచ్చాం. అయితే ప్రస్తుతానికి
స్టోరీలైన్ మాత్రమే లాక్ చేశాం. స్క్రీన్ ప్లే పై వర్క్ చేయాల్సి ఉంది. అంతకుమించి
ఈ సినిమాపై అప్ డేట్ లేదు."
ఇక
రాజమౌళితో చేస్తున్న RRRపై కూడా స్పందించాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం తను, తనతో పాటు
యూనిట్ అంతా చాలా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చాడు. కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన
తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నాడు.
"RRR
కోసం ఏకంగా 18 నెలలు ట్రయినింగ్ తీసుకున్నాను. దీని కోసం ఓ ప్రత్యేకమైన ఫిజిక్ కావాలని
రాజమౌళి కోరారు. అందుకే అంత కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాకు కమిట్ అయ్యే టైమ్ లో
నా బరువు 71 కిలోలు. రాజమౌళి కోరిన మీదట మరో 9 కేజీలు పెరిగాను."
లాక్
డౌన్ టైమ్ లో అదే బరువు, అదే ఫిజిక్ ను కొనసాగించడం చాలా కష్టంగా ఉందని.. అయినప్పటికీ
సినిమా కోసం కష్టపడక తప్పదని అంటున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇంతకంటే
ఎక్కువగా అప్ డేట్స్ ఇవ్వడం తనకు ఇష్టంలేదని, ఇంకా ఎక్కువ చెబితే గొడ్డలి పట్టుకొని
రాజమౌళి తనను వెంబడిస్తాడని సరదాగా కామెంట్ చేశాడు ఎన్టీఆర్.
No comments:
Post a Comment