సూపర్ స్టార్ రజిని కాంత్ నుండి త్వరలో 'Annaatthe'సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ మొదలై చాలా నెలలవుతుంది. మధ్యలో కరోన కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు కంప్లీట్ చేసేశాడు రజినీ కాంత్. ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ ఉదృతి భయకరంగా ఉంది. అయినా ఈ టైం లో తన సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత కోసం డేర్ చేశాడు సూపర్ స్టార్.
ఇటివలే
రామోజీ ఫిలిం సిటీలో వైద్య బృందం సహాయంతో జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మంది క్రూతో
సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ షూట్ పూర్తి చేశారు. దాదాపు ముప్పై రోజుల పాటు ఈ షెడ్యుల్
లో పాల్గొన్నారు రజినీ. మిగతా నటీ నటులు కూడా సహకరించి షూటింగ్ డేట్స్ అందించారు. ఎటువంటి
ఆటంకం లేకుండా అనుకున్న టైంకి మిగిలిన సన్నివేశాలను కంప్లీట్ చేసి చెన్నై వెళ్ళిపోయారు
యూనిట్.
ఆ
మధ్య లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాక యూనిట్ లో కొందరికి కరోన సోకింది.
రజిని కి కరోన ఎఫెక్ట్ లేదు కానీ ఆ టైంలో రజినీ కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు.
దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందా లేదా అని నిర్మాత ఖంగారు పడ్డారు. ఇక వయసు రిత్యా
రజినీ కూడా ఇప్పుడప్పుడే షూటింగ్ లో పాల్గొనరని అనుకున్నారు అందరు. కానీ ఎవ్వరూ ఊహించని
విధంగా షూటింగ్ లో పాల్గొని యూనిట్ సపోర్ట్ తో కేర్ తీసుకుంటూ సినిమాను ఫినిష్ చేసేసి
శెభాష్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న
ఈ సినిమాను నవంబర్ లో దీపావళి కానుకగా విడుదల చేయదానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment