Thursday, May 13, 2021

#SSMB29 – Rumors on Mahesh Character in Anil Ravipudi film | Zee Cinemalu News Updates

అదేంటి ఇంకా మహేష్ 28 సినిమానే సెట్స్ పైకి వెళ్ళలేదు అప్పుడే ఆ సినిమా తర్వాత ఉండబోయే సినిమాపై రూమరా అనుకుంటున్నారా ? అవునండీ త్రివిక్రమ్ సినిమా తర్వాత్ మహేష్ చేయబోయే సినిమా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపొయింది. అవును అనిల్ రావిపూడి తో తన 29 వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్. ఈ విషయన్ని అనిల్ రావిపూడి కూడా కన్ఫర్మ్ చేశాడు. త్రివిక్రమ్ గారి సినిమా తర్వాత మళ్ళీ తమ కాంబోలో సినిమా ఉంటుందని ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

అయితే ఈ కాంబో ఇలా కన్ఫర్మ్ అయ్యిందో లేదో అలా ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఈసారి మహేష్ తో అనిల్ ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తీయనున్నాడని స్క్రిప్ట్ తో పాటు క్యారెక్టర్ కూడా మహేష్ కి కొత్తగా అనిపించినందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే కథ పరంగా స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ సినిమా అనిల్ స్టైల్ లో యాక్షన్ ఎంటర్తైనింగ్ గానే ఉంటుందని టాక్.

సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ని కాసేపు ఆర్మీ ఆఫీసర్ గా చూపించి ఆ తర్వాత రాయలసీమ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను నడిపించాడు అనిల్. ఇప్పడు మహేష్ తో మరోసారి అనిల్ అలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే చేస్తాడని అంటున్నారు. కాకపోతే ఈసారి మహేష్ క్రికెటర్ గా కనిపిస్తూ కొత్తగా ఎంటర్టైన్ చేస్తాడట. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అనిల్ లేదా మహేష్ లు ఈ ప్రాజెక్ట్ గురించి నోరువిప్పాలి. అప్పటి వరకు ఇందులో నిజమెంత అనేది తెలియదు. ఏదేమైనా మహేష్ స్పోర్ట్స్ డ్రామా చేసి చాలా ఏళ్లవుతుంది. అప్పుడెప్పుడో ఒక్కడు సినిమా చేశాడు మళ్ళీ ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ssmb29-rumors-on-mahesh-character-in-anil-ravipudi-film-189281/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...