ప్రభాస్ కు సంబంధించి ప్రస్తుతం సెట్స్ పై 2 సినిమాలున్నాయి. ఓకే చేసిన సినిమా ఒకటి ఉంది. ఇంకో సినిమా ఎనౌన్స్ మెంట్ స్టేజ్ లో ఉంది. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ.. ప్రభాస్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఒకే ఒక్క సినిమా. అదే ఆదిపురుష్.
అవును..
ఆదిపురుష్ ప్రాజెక్టును పూర్తిచేసిన తర్వాతే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లాలని ప్రభాస్
తాజాగా నిర్ణయించుకున్నాడు. ఓవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా సెట్స్ పై
ఉన్నప్పటికీ, ఆదిపురుష్ కంప్లీట్ అయిన తర్వాతే సలార్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ప్రభాస్
ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ రీజన్ ఉంది. ఆదిపురుష్ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ.
షూటింగ్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ కోసమే కనీసం 6 నెలల టైమ్ పడుతుంది. సో.. వీలైనంత
తొందరగా షూటింగ్ పూర్తిచేయాలి. అందుకే ప్రభాస్ ఆదిపురుష్ కే తొలి ప్రాధాన్యం ఇచ్చాడు.
ఆదిపురుష్
సినిమాకు సంబంధించి ఇంకా 90 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. లెక్కప్రకారం, ఈపాటికి హైదరాబాద్
లో మరో షెడ్యూల్ ప్రారంభం కావాలి. కానీ తెలంగాణలో లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది.
ఎప్పుడు షూటింగ్స్ ప్రారంభమైతే అప్పుడు ఆదిపురుష్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు
ప్రభాస్.
ఈ
మూవీలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్, కృతిసనన్ కు కూడా ఇతర బాలీవుడ్ ప్రాజెక్టులు పెండింగ్
లో ఉన్నాయి. వీలైనంత తొందరగా ఆదిపురుష్ ను పూర్తిచేయాలని వాళ్లు భావిస్తున్నారు. అందుకే
కరోనా టైమ్ లో కూడా షూటింగ్ కు వచ్చేందుకు వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ బ్యాడ్
లక్. లాక్ డౌన్ పడి షూటింగ్స్ ఆగిపోయాయి.
ఆదిపురుష్
పూర్తిచేసిన తర్వాత సలార్ సినిమాను కంటిన్యూ చేస్తాడు ప్రభాస్. ఆ తర్వాత నాగ్ అశ్విన్
దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ గ్యాప్ లో మరో మూవీని అఫీషియల్ గా
ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. అయితే అది యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై చేయబోయే స్ట్రయిట్
బాలీవుడ్ సినిమానా లేక సుధా కొంగర దర్శకత్వంలో చేయబోయే మూవీనా అనే విషయంపై ఇంకా క్లారిటీ
లేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కూడా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పటికీ
అది లెక్కలోకి రాదు. ఎందుకంటే, దానికి సంబంధించి కేవలం 4 రోజుల షూట్ మాత్రమే పెండింగ్
ఉంది.
No comments:
Post a Comment