ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ విడుదల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కన్ను RRR పై పడింది. సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఆ రిలీజ్ డేట్ ని మేకర్స్ అందుకోవడం కష్టమే అనిపిస్తుంది. సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పైగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. అందుకే మేకర్స్ మరోసారి సినిమా విడుదల వాయిదా వేసి మరో డేట్ సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
అసలు
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్స్ లోకి రావలసి ఉంది.
కానీ కరోన ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు దసరా బరిలో నిలిచింది. ఇక దసరా మిస్ అయితే మేకర్స్
చేతిలో ఉన్న మరో మంచి డేట్ వచ్చే ఏడాది సంక్రాంతి. కానీ 2022 సంక్రాంతి కి ఇప్పటికే
మహేష్ 'సర్కారువారి పాట', పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి.
అందుకే జక్కన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనే
టాక్ వినబడుతుంది.
ఇక
ఇండస్ట్రీ లో కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. జక్కన్న కూడా అలాంటి సెంటిమెంట్ ని
ఫాలో అవుతూ RRR ని 'బాహుబలి' రిలీజయిన ఏప్రిల్ నెలలో అదే తేదికి రిలీజ్ చేస్తాడని అంటున్నారు.
మరి జక్కన్న ఈ సెంటిమెంట్ ని నిజంగా ఫాలో అవుతాడా ? RRR ఈ ఏడాది రానట్టేనా? అనే ప్రశ్నలకు
సమాధానం రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
No comments:
Post a Comment