Tuesday, June 15, 2021

Prabhas 25th movie with Prashant Neel| Zee Cinemalu Latest News Updates

సలార్.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడ మేటర్ ఇది కాదు. ప్రభాస్-ప్రశాంత్ కాంబోలో మరో సినిమా రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ 25వ చిత్రం ఇదే.

రీసెంట్ గా మరో పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఆ కథను మహేష్ బాబుకు వినిపించాడట. అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ దాన్ని రిజెక్ట్ చేసినట్టు టాక్. ఇప్పుడు అదే స్టోరీతో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఓ బడా ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుందట.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పట్లో అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. సలార్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

ఇక సలార్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది. తన చేతిలో ఉన్న సినిమాల్లో ప్రభాస్ ముందుగా ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అటు శృతిహాసన్ కూడా వచ్చే నెల నుంచి ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. ఈసారి సలార్ కు సంబంధించి చాలా పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/prabhas-25th-movie-with-prashant-neel-191002/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...