Wednesday, June 16, 2021

RangDe World Television Premiere on 20th June in Zee Telugu| Zee Cinemalu Latest News Updates

 "అనుకి అర్జున్ అంటే ప్రాణం. తన జీవితంలో ప్రతి సంతోషాన్ని అర్జున్ తో పంచుకోవాలనుకుంటుంది. అర్జున్ మాత్రం అనును అపార్థం చేసుకుంటాడు. ఇలాంటి ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. తర్వాత ఏం జరిగిందనేది ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. తను అనును అపార్థం చేసుకున్నానని అర్జున్ తెలుసుకుంటాడు. ఇద్దరూ కలిసిపోతారు."

చెప్పుకోవడానికి చాలా సింపుల్ స్టోరీ. కానీ ఇలాంటి సింపుల్ స్టోరీని ఆకట్టుకునేలా తెరపై చూపించడమే కష్టం. అలాంటి టఫ్ జాబ్ ను ఎంతో ఇష్టంగా, అందంగా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఆ సినిమానే రంగ్ దే.

ప్రేక్షకుల్ని ప్రేమలోకంలోకి తీసుకెళ్లింది ఈ సినిమా. అనుగా కీర్తిసురేష్, అర్జున్ గా నితిన్ పెర్ఫార్మెన్స్, వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. లవ్ ఎలిమెంట్స్ తో పాటు సందర్భోచితంగా వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి.

థియేటర్లలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రీసెంట్ గా ZEE5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలో కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ZEE TELUGU ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. మరో 4 రోజుల్లో 20వ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో రంగ్ దే సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rangde-world-television-premiere-on-20th-june-in-zee-telugu-191045/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...