Tuesday, June 1, 2021

RRR – Big Fight between NTR and Ramcharan| Zee Cinemalu Latest News Updates

RRR Movie స్టోరీలైన్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. కేవలం అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో అల్లిన ఫిక్షన్ కథ అని మాత్రమే తెలుసు. ఇద్దరూ ఒకే కాలంలో, ఒకే ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ బయటపడింది.

RRR మూవీలో ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య భీకరమైన ఫైట్ సీక్వెన్స్ ఉంది. టోటల్ సినిమాకే అది హైలెట్ అవుతుంది. ఆ ఫైట్ సీన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు.

"ఫైట్స్ వస్తుంటే విలన్ ను హీరో నరకాలని కోరుకుంటాం. అదే ఇద్దరు మంచివాళ్లు కొట్టుకుంటుంటే ఏం కోరుకుంటాం. ఎవర్ని సపోర్ట్ చేస్తాం. ఇద్దరు సూపర్ స్టార్లు, ఇద్దరూ మంచోళ్లే. సినిమాలో ఎన్టీఆర్ మంచోడని చరణ్ కు తెలుసు. చరణ్ మంచోడని ఎన్టీఆర్ కు కూడా తెలుసు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరూ తలపడతారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే మనకు ఏడుపొస్తుంది. ఫస్ట్ టైమ్ నాకథ రాసింది తానే అయినా, అది సినిమా అని తెలిసినా, చివరికి ఇద్దరూ కలుస్తారనే విషయం కూడా తెలిసినా.. ఆ క్షణంలో ఎన్టీఆర్-చరణ్ ఫైట్ చేస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యానని అన్నారు విజయేంద్రప్రసాద్. ఇలా RRR Movieలో చరణ్-తారక్ మధ్య భారీ ఫైట్ ఉందనే విషయాన్ని బయటపెట్టారు.

ఇక RRR అప్ డేట్స్ విషయానికొస్తే.. 2 పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రాజమౌళి రెడీగా ఉన్నాడు. కేవలం 2 పాటలు, ప్యాచ్ వర్క్ అయినప్పటికీ.. షూటింగ్ కు 40 నుంచి 50 రోజులు పడుతుందని అంచనా.కు ఫైట్ చూస్తే కన్నీళ్లు వచ్చాయి."

ఇక పాటల విషయానికొస్తే... చరణ్, తారక్ పై వచ్చే ఇంట్రో సాంగ్ పెండింగ్ ఉంది. అది తీయడానికి కనీసం 30 రోజులు పడుతుందట. ఇక అలియాభట్-చరణ్ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rrr-big-fight-between-ntr-and-ramcharan-190255/


No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...