ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి 'RRR' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఇక దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమాల విషయంలోనూ ఇంకా ఆలస్యం జరగనుంది. నెక్స్ట్ మహేష్ బాబుతో జక్కన్న ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత KL నారాయణ ఇద్దరికీ ఓ ప్రాజెక్ట్ కోసం ఎప్పుడో అడ్వాన్స్ అందించారు. మొన్నీ మధ్యే రాజమౌళి కూడా మహేష్ నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు ప్రకటించేశాడు.
అయితే
మహేష్ సినిమా అవ్వగానే మరో భారీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు రాజమౌళి. అవును హాలీవుడ్
లో ఓ సినిమా తీయబోతున్నాడట జక్కన్న, ఆ సినిమా కోసం ఓ సంస్థ టైయప్ అవ్వనున్నాడని తెలుస్తుంది.
అయితే ఆ సినిమా హాలీవుడ్ స్టైల్ లో కాకుండా మన కథతో హాలీవుడ్ మేకింగ్ తో ఉంటుందట. ఇదే
ఇప్పుడు రాజమౌళి అభిమానులను సర్ ప్రయిజ్ చేస్తున్న విషయం. ఇక్కడి కథతో అక్కడి వాళ్ళను
రాజమౌళి ఎలా మెప్పిస్తాడు ? ఇందులో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి ? అంటూ అప్పుడే డిస్కషన్
మొదలు పెట్టేశారు.
నిజానికి
ప్లాన్ అయితే రెడీ గా ఉంది కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది.
ప్రస్తుతం రాజమౌళి చేతిలో ఉన్న RRR సినిమా పూర్తి చేసి ఆ తర్వాత మహేష్ సినిమా చేయాల్సి
ఉంది. మహేష్ సినిమా అంటే ఎలాగో రెండేళ్ళపైనే పడుతుంది. సో రాజమౌళి హాలీవుడ్ సినిమాకు
ఎంత లేడన్నా ఇంకా మూడేళ్ళు పట్టనుంది. ఈ లోపు ఆ సినిమాకు తండ్రి దగ్గరి నుండి కథ -కథనం
రాయిన్చుకుంటాడు జక్కన్న. ఇప్పుడే స్టార్ట్ అవ్వకపోయినా రాజమౌళి హాలీవుడ్ మూవీ న్యూస్
ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. చూడాలి జక్కన్న ఆ సినిమాతో తెలుగు చిత్ర
దర్శకుడిగా అక్కడ ఎలాంటి స్థానం అందుకుంటాడో?
No comments:
Post a Comment