Tuesday, June 29, 2021

RRR Shooting Completed Except 2 Songs | Zee Cinemalu Latest News

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ #RRR కి సంబంధించి చాలా ప్రశ్నలున్నాయి. సినిమా షూటింగ్ ఎంత వరకు అయ్యింది ? అక్టోబర్ లో రిలీజ్ ఉంటుందా ? ఇలా అభిమానుల్లో కొన్ని సందేహాలున్నాయి. వీటన్నిటికి తాజా అప్డేట్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. RRR కి సంబంధించి తాజాగా షూటింగ్ అప్ డేట్స్ చెప్పేశారు. రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయింది. అంటూ ఎన్టీఆర్ , చరణ్ బైక్ పై వస్తున్న ఓ అదిరిపోయే స్టిల్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.

కేవలం అప్ డేట్ మాత్రమే చెప్పకుండా దానితో పాటు మంచి పోస్టర్ తో ట్రీట్ ఇచ్చాడు జక్కన్న. తాజాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షెడ్యుల్ లో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. త్వరలోనే మిగిలిన రెండు పాటలను షూట్ చేయనున్నారు. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని సమాచారం. ఆ సాంగ్ ను తారక్, చరణ్ లపై చిత్రీకరించనున్నారు. ఆ షెడ్యుల్ తో టోటల్ షూట్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టనున్నారు.

అయితే మేకర్స్ ఇచ్చిన ఈ అప్ డేట్ తో RRR అక్టోబర్ లో రిలీజ్ అవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. దీన్ని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు షూట్ చేసిన సీన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగేలా టీంని యాక్టివ్ చేశాడు జక్కన్న. షూట్ చేసిన సీన్స్ కి చరణ్, ఎన్టీఆర్ లతో పాటు మిగతా నటీనటులతో ఎప్పటికప్పుడు డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెడుతూ వాటి పనులు చూసుకుంటున్నారు. సాంగ్స్ తో పాటు జరిగిన పోర్షన్ కి రీరికార్డింగ్ వర్క్ కూడా చేస్తున్నారు కీరవాణి. ఇలా అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేస్తూ అక్టోబర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. అన్ని అనుకున్నట్లు జరిగి అప్పటి వరకు థియేటర్స్ అన్నీ ఓపెన్ అయితే ప్రకటించినట్లే అక్టోబర్ 13న దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/rrr-shooting-completed-except-2-songs-191535/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...