Tuesday, June 29, 2021

Telugu Movies May Release From August| Zee Cinemalu Latest News

 ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి మెల్ల మెల్లగా చక్కబడుతుంది. షూటింగ్స్ మొదలు పెడుతుండటంతో సినీ కార్మికులకు నటీ నటులకు మళ్ళీ పని దొరుకుతుంది. ఇక థియేటర్స్ తెరవడం అందులో సినిమా వేయడమే తరువాత కార్యక్రమం. అయితే ఇది జరగడానికి ఇంకా ఓ నేలపైనే పట్టొచ్చు. తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్స్ ఓపెన్ కి పర్మీషణ్ ఇచ్చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ నైట్ కర్ఫ్యూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్ డౌన్ సడలింపు జరిగితే ఇక నిర్మాతలు తమ సినిమాల ఎనౌన్స్ మెంట్ ముందుకొస్తారు. ఇప్పటికే 'SR కళ్యాణమండపం' , 'ఇష్క్' లాంటి చిన్న సినిమాలతో పాటు నాని 'టక్ జగదీశ్' , నాగ చైతన్య 'లవ్ స్టోరి' , 'రానా విరాటపర్వం' సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అంతా సెట్ అవ్వగానే ఇవన్నీ ఒక్కో వారం థియేటర్స్ లోకి వస్తాయి.

ఇక అన్నిటికంటే ముందుగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'SR కళ్యాణ మండపం' సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ మొదటి వారంలో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఆగస్ట్ లో ఈ సినిమా నుండి వరుసగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి జులై నెల దాటితే ఆగస్ట్ నుండి సినిమా లవర్స్ కి ఇక పండగే. మరి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

అటు పెద్ద సినిమాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆచార్య, అఖండ, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేయలేదు. ఒకటి దీపావళి, ఇంకోటి దసరా, మరొకటి క్రిస్మస్ అంటూ గాసిప్స్ మాత్రమే వస్తున్నాయి తప్ప, యూనిట్ నుంచి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా.. ఆగస్ట్ నుంచి పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకున్న తర్వాత అప్పుడు వీటిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/telugu-movies-may-release-from-august-191539/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...