జూన్ 30.. అంటే రేపు అల్లరినరేష్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా అల్లరోడి నుంచి మరో మువీ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. కెరీర్ లో అల్లరినరేష్
కు ఇది 58వ సినిమా. ఎలాంటి డీటెయిల్స్ రివీల్ చేయకుండా కేవలం ఎనౌన్స్ మెంట్ పోస్టర్
మాత్రమే ఇచ్చారు. అందులో విమానం ల్యాండ్ అవుతున్నట్టు చూపించారు. రేపు ఉదయం 10 గంటలకు
ఎనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఈ సస్పెన్స్ తప్పదు.
మహర్షి నుంచి రూటు మార్చాడు అల్లరోడు.
కామెడీ సినిమాలు చేస్తూనే, కాస్త డెప్త్ ఉన్న సీరియస్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు.
తనను సీరియస్ రోల్స్ లో కూడా ఆదరిస్తారని మహర్షి సినిమాతో తెలుసుకున్న అల్లరి నరేష్..
నాంది సినిమాతో తన నమ్మకం నిజమైందనే నిర్థారణకు వచ్చాడు.
పూర్తిగా సీరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది
నాంది. ఇందులో అల్లరి నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా నటించాడు. సినిమాలో ఎక్కడా ఓ కామెడీ
సీన్ ఉండదు. పక్కా సీరియస్ మూవీ. ఇన్నాళ్లూ కామెడీ హీరో అనిపించుకున్న అల్లరినరేష్,
ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ తో కూడా హిట్ కొట్టగలడని నిరూపించింది నాంది. అంతేకాదు..
కామెడీ చేసినోడు ఏదైనా చేయగలడనే నమ్మకాన్ని నాంది నిజం చేసింది.
అలా విభిన్న కథలు, డిఫరెంట్ మూవీస్ సెలక్ట్
చేసుకుంటున్న అల్లరి నరేశ్.. ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నాడే ఆసక్తి అందర్లో ఉంది.
అందుకే #NARESH58పై అందరి చూపు పడింది. ఈ సస్పెన్స్ కు రేపు ఉదయం 10 గంటలతో తెరపడబోతోంది.
Read More: http://www.zeecinemalu.com/news-gossip/allari-naresh-new-movie-announcement-tomorrow-191546/
No comments:
Post a Comment