అల్లు అర్జున్ కి ఎప్పటి నుండో తమిళ్ సినిమా చేసి కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని ఉంది. కొన్నేళ్ళ క్రితం లింగుస్వామితో తెలుగు , తమిళ్ లో ఓ ప్రాజెక్ట్ అనుకొని చెన్నై వెళ్లి లాంచ్ లో కూడా పాల్గొన్నాడు బన్నీ. ఏవో కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అక్కడి నుండి బన్నీ కోలీవుడ్ ఎంట్రీ ఆలస్యం అవుతూ వచ్చింది. 'పుష్ప' పాన్ ఇండియా సినిమాతో తమిళ్ లో పరిచయమవుతున్న అది డబ్బింగ్ సినిమా కిందకే వస్తుంది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ కి బన్నీ ప్రిపైర్ అవుతున్నాడు.
మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ కోలీవుడ్
లో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబో సినిమా ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా తమిళ నిర్మాత కలైపులి థాను నుండి అల్లు
అర్జున్ కి అడ్వాన్స్ అందిందని సమాచారం. సో బన్నీ బైలింగ్వెల్ సినిమాను ఆయనే నిర్మించే
ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం వహించే అవకాశం కనిపిస్తుంది.
ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ తర్వాత
ఐకాన్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 కి సంబంధించి షూట్ ఫినిష్
చేస్తాడు. మరి ఈ గ్యాప్ లోనే మురుగదాస్ తో బన్నీ సినిమా ఉంటుందా ? లేదా పుష్ప పార్ట్
2 తర్వాత ఈ కాంబో సినిమా రానుందా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా తన కోలీవుడ్ ఎంట్రీ ఈసారి
పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు స్టైలిష్ స్టార్. త్వరలోనే ఈ సినిమాను ఎనౌన్స్ మెంట్
కి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
No comments:
Post a Comment