లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు రామ్. #Rapo19 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సినిమాలో విలన్ గా కొందరు హీరోల పేర్లు చక్కర్లు కొడుతుండగా తాజాగా విలన్ ఎవరనేది తెలియజేస్తూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఆది పినిశెట్టి ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు. ఆది పినిశెట్టి కి వెల్కం చెప్తూ ఈ విషయాన్ని చెప్పారు మేకర్స్.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు'
సినిమాలో స్టైలిష్ విలన్ గా నటించాడు ఆది పినిశెట్టి. ఆ సినిమాతో విలన్ గా మంచి ఆదరణ
అందుకున్నాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా
మూడు సినిమాలు చేస్తున్న ఆది మళ్ళీ ఇప్పుడు రామ్ సినిమాతో విలన్ గా కనిపించబోతున్నాడు.
లింగుస్వామి ఆది కోసం మంచి పవర్ ఫుల్ విలనిజం చూపించే క్యారెక్టర్ డిజైన్ చేశాడట.
లింగుసామి సినిమాల్లో హీరో పాత్రలు ఎంత
పవర్ ఫుల్ గా ఉంటాయో, విలన్ పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. ఈ దర్శకుడు తీసిన
గత సినిమాలు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. ప్రత్యేకంగా విలన్ కోసం కూడా ట్రాక్స్
రాయడం ఈ డైరక్టర్ స్పెషాలిటీ. విలనిజంను పీక్స్ లో ఎలివేట్ చేసి, హీరోయిజం పండించే
అతికొద్ది మంది సౌత్ దర్శకుల్లో లింగుసామి ఒకడు. అందుకే ఇతడి సినిమాల్లో విలన్ పాత్ర
పోషించిన నటులకు కూడా గుర్తింపు వస్తుంది. ఈ ట్రాక్ రికార్డ్ తెలుసుకున్నాడు కాబట్టే..
ప్రస్తుతం హీరోగా నటిస్తున్నప్పటికీ, మరోసారి విలన్ గా కనిపించేందుకు ఒప్పుకున్నాడు
ఆది.
ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్
ఉన్న పాత్రలో నటించనున్నాడని టాక్ వినబడుతుంది. అందులో ఒకటి డాక్టర్ కాగా మరొకటి పోలిస్
అని సమాచారం. ఇటివలే 'రెడ్' లో రామ్ డ్యుయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా
రామ్ కి ఆశించిన ఫలితం అందించలేదు. మరి ఈ బైలింగ్వెల్ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో
చూడాలి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
No comments:
Post a Comment