కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల తెలుగు , తమిళ్ లో బైలింగ్వెల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రాజీ ప్రాజెక్ట్ తో తో పాటు తెలుగులో ఇంకో సినిమా కూడా ఫైనల్ చేసుకున్నాడట ధనుష్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ, ధనుష్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే ధనుష్ కి స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేశాడట వెంకీ అట్లూరి.
అయితే ముందు శేఖర్ కమ్ముల సినిమాను మొదలు
పెట్టబోతున్నాడు ధనుష్. ఆ సినిమాకు సంబంధించి రెండు షెడ్యుల్స్ పూర్తయ్యాక వెంకీ తో
సినిమా స్టార్ట్ చేస్తాడని సమాచారం. ఈ సినిమాలో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా
నటించనుందని ఇన్సైడ్ టాక్. ఇటివలే మేకర్స్ పూజ ని సంప్రదించి అడ్వాన్స్ అందించారని
తెలుస్తుంది. అంతే కాదు సినిమాలో ఒక కీ రోల్ కోసం వెంకీ అట్లూరి సీనియర్ హీరోయిన్ భూమిక
ని అప్రోచ్ అయ్యాడట.
ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్
శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు కాస్టింగ్ ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ
అట్లూరి. దసరా కల్లా అన్నీ పనులు పూర్తి చేసి పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలు పెట్టనున్నారట
మేకర్స్. ఈ లోపు అంటే వినాయకచవితి రోజు ఈ కాంబో సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని
సమాచారం. టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతున్న ధనుష్ వీటితో
తెలుగు ప్రేక్షకులకు ఎలా మెప్పించి విజయాలు అందుకుంటాడో వేచి చూడాలి.
No comments:
Post a Comment