Tuesday, July 6, 2021

Allu Arjun Pushpa shoot resumes today in Hyderabad | Zee Cinemalu Latest News

లాంగ్ గ్యాప్ తర్వాత పుష్ప మూవీ మళ్లీ సెట్స్ పైకొచ్చింది. ఈరోజు ఉదయం ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. హీరో అల్లు అర్జున్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందంట.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్-1కు సంబంధించిన షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజు స్టార్ట్ అయిన షెడ్యూల్ లో, పార్ట్-1కు సంబంధించి టోటల్ షూట్ పూర్తిచేయబోతున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు అటు రష్మిక కాల్షీట్ల ఎడ్జెస్ట్ మెంట్ కూడా ఈ ప్రాజెక్టుకు కష్టంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 సినిమాలు, కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. ఎంత త్వరగా కాల్షీట్లు ఇస్తే అంత త్వరగా పుష్ప షూట్ పూర్తవుతుంది.

మలయాళ స్టార్ యాక్టర్ ఫహాజ్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడికిదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ ఉంది. ఆ పాటలో బన్నీతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ డాన్స్ చేయబోతోంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/allu-arjun-pushpa-shoot-resumes-today-in-hyderabad-191752/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...