Wednesday, July 7, 2021

Ram Krithi Shetty Lingusamy Movie Shooting Details | Zee Cinemalu Latest News

లింగుస్వామి దర్శకత్వంలో #RaPo19 సినిమా చేయబోతున్నాడు రామ్. ఎనర్జిటిక్ స్టార్ కోసం మంచి మాస్ మసాలా సబ్జెక్ట్ రెడీ చేసి ఇటివలే ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చాడు లింగుస్వామి. ఫైనల్ నెరేషన్ విన్నాక రామ్ తన ఎగ్జయిట్మెంట్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేస్తూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఈనెల 12 నుండి సెట్స్ పైకి వెళ్తుంది.

సినిమాలో రామ్ ఎనర్జీ ఓ రేంజ్ లో ఉంటుందని , అలాగే లింగుస్వామి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో సరికొత్త లుక్ ట్రై చేసి మాస్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న రామ్ ఈ సినిమాలో కూడా ఓ కొత్త లుక్ ట్రై చేయనున్నాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఒక లుక్ ఫైనల్ చేసి టెస్ట్ షూట్ కూడా చేశారట. మరి రామ్ ఇందులో ఎలాంటి లుక్ తో కనిపిస్తాడు ? తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ? అనే విషయాలు మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

రామ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు మాటలు అందించనున్నారు.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ram-krithi-shetty-lingusamy-movie-shooting-details-191816/


No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...