Wednesday, July 7, 2021

Chiranjeevi Acharya Final Schedule Begins | Zee Cinemalu Latest News

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కరోన కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు , ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ షూట్ ను ఈరోజు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని కోకాపేట్ లో వేసిన భారీ సెట్ లో ఫైనల్ షెడ్యుల్ మొదలైంది.

ముందుగా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించి 2 రోజుల్ల సాంగ్ షూట్ చేసే పనిలో ఉన్నారు యూనిట్. ఈ సాంగ్ లో నటీనటులంతా కనిపిస్తారని సమాచారం. చిరుతో కలిసి చరణ్, కాజల్, పూజా హెగ్డే ఇలా అందరూ ఉంటారట. ఆగస్ట్ లోపే టోటల్ షూట్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోన కారణంగా వాయిడా పడుతూ వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్.

మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆల్బం నుండి రెండో పాట విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ లాహే లాహే కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా నుండి రిలీజ్ కాబోయే రెండో సింగిల్ ఎలా ఉంటుందో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. త్వరలోనే సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆచార్య థియేటర్స్ లోకి ఎప్పుదోచ్చేది తెలియనుంది.

Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/chiranjeevi-acharya-final-schedule-begins-191823/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...