రిలీజ్ వరకు వచ్చి పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో నాని 'టక్ జగదీష్' ఒకటి. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోన సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో త్వరలోనే థియేటర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మేకర్స్ ఆగస్ట్ లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఆగస్ట్ రెండో వారం లేదా మూడో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
ప్రస్తుతం మేకర్స్ మీటింగ్ పెట్టుకొని
ఒక డేట్ ఫైనల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ వారంలోనే సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్
డేట్ ప్రకటించే అవకాశం ఉంది. నాని సినిమా తర్వాత మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ తెలియాల్సి
ఉంది.
తెలంగాణ, ఆంధ్రలో థియేటర్స్ రీ ఓపెన్
కి పర్మీషణ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఒక్కో సినిమా ఎనౌన్స్ మెంట్ వదిలే ప్లాన్ లో
ఉన్నారు నిర్మాతలు. ఏదేమైనా ఆగస్ట్ నుండి మళ్ళీ కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి
చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇక రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్లు, ప్రమోషన్స్ తో మళ్ళీ
టాలీవుడ్ కళకళలాడనుండి. అక్టోబర్ లో భారీ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి.
No comments:
Post a Comment