ఇప్పటికే థియేటర్లలో దుమ్ముదులిపాడు వకీల్ సాబ్. ఈ సినిమా రాకతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న స్క్రీన్స్ అన్నీ కళకళలాడాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ కావడంతో అతడి ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టారు.
అలా థియేటర్లలో హంగామా చేసిన వకీల్ సాబ్
సినిమా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా సందడి చేయబోతోంది. జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్ గా గ్రాండ్ గా టెలికాస్ట్ కాబోతోంది. ఈరోజు (జులై 18, ఆదివారం)
సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగు ఛానెల్ లో వకీల్ సాబ్ సునామీ స్టార్ట్ అవుతుంది.
పవర్ ఫుల్ వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్
నటించిన ఈ సినిమాలో స్పెషాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడియన్స్
అందరికీ వకీల్ సాబ్ ఎట్రాక్షన్స్ తెలుసు. పవన్ కల్యాణ్ ఎప్పీయరెన్స్, యాక్షన్, మేనరిజమ్స్
మొదటి ఎలిమెంట్ అయితే.. ముద్దుగుమ్మలు నివేత థామస్, అంజలి, అనన్య నాగళ్ల పెర్ఫార్మెన్స్
మరో ఎలిమెంట్.
ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పాటలతో, ఆర్ఆర్ తో సినిమాను
నెక్ట్స్ లెవెల్ లో నిలబెట్టాడు తమన్. వేణుశ్రీరామ్ డైరక్షన్ లో దిల్ రాజు బ్యానర్
పై వచ్చిన ఈ మెగా మూవీ.. ఇప్పుడు జీ తెలుగు ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా రెడీ అయింది.
ఈరోజు (18వ తేదీ) సాయంత్రం 6 గంటలకు జీ ఇప్పుడు జీ తెలుగు ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్
గా రెడీ అయింది. తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ కాబోతోంది. సో.. మరో పవర్ ప్యాక్డ్ హంగామాకు
రెడీగా ఉండండి.
No comments:
Post a Comment