అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ 'పుష్ప' సినిమాకు సంబంధించి కొన్ని లీకులు ఇటు టీంని అటు ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. అవును సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి కొన్ని మేకింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కొన్ని ఓ యాక్షన్ ఎపిసోడ్ క్లిప్ లీక్ అయింది. ఆ తర్వాత సాంగ్ మేకింగ్ వీడియో బయటికి వచ్చింది. అక్కడి నుండి వరుసగా పుష్ప లీక్ అంటూ ఏదో ఒక క్లిప్ వస్తూనే ఉంది.
తాజాగా పుష్ప లీక్స్ అంటూ మరికొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో
హంగామా చేస్తున్నాయి. అందులో ఒకటి ఎడిటింగ్ జరుగుతుండగా లీక్ అవ్వడం ఆశ్చర్యం. అసలు
వరుసగా ఇన్ని లీకులు జరుగుతుంటే పుష్ప టీం ఏం చేస్తుంది ? వీడియో క్లిప్స్ లీకవ్వకుండా
ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి కాదు రెండు
కాదు ఇలా ఇన్ని లీకులు జరుగుతుంటే పైగా వాటిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ కనిపిస్తుంటే
మేకర్స్ సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు.
మరి పుష్ప లీకులు ఇక్కడితో అయినా ఆగుతాయా ? ఇప్పటికైనా మేకర్స్
జాగ్రత్త తీసుకొని లీకులు జరగకుండా చూసుకుంటారా ? చూడాలి. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్
స్టేజిలో ఉన్న పుష్ప డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే
ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ మొదలు పెట్టిన మేకర్స్ త్వరలోనే భారీ ప్రమోషన్స్ పై దృష్టి
పెట్టనున్నారు. మైత్రి మూ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
అందిస్తున్నాడు.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/back-to-back-leaks-from-allu-arjuns-pushpa-193233/
No comments:
Post a Comment